Andhra Pradesh: ఏపీలో వచ్చే 5 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వర్షాలు ఎక్కడంటే…?

|

Jun 01, 2024 | 8:35 PM

కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నట్లు తెలిపారు.లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.....

Andhra Pradesh: ఏపీలో వచ్చే 5 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వర్షాలు ఎక్కడంటే...?
Andhra Weather
Follow us on

ఐఎండి సూచనల ప్రకారం రాబోవు 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగాడానికి అలాగే రాయలసీమలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకులంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నట్లు తెలిపారు.లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండే అవకాశం ఉందని ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

02 జూన్, ఆదివారం :

• అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

03 జూన్, సోమవారం :

• పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తెలిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.

04 జూన్, మంగళవారం :

• అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

05 జూన్, బుధవారం :

• పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

శనివారం సాయంత్రం 7 గంటల నాటికి అన్నమయ్య జిల్లా రాజంపేటలో 32.5మిమీ,అనంతపురం జిల్లా గుంతకల్లులో 30.5మిమీ, చిత్తూరు జిల్లా గుడుపల్లెలో 24.2మిమీ, చిత్తూరులో 21మిమీ, తవణంపల్లె 18.7మిమీ,విశాఖ జిల్లా భీమునిపట్నంలో 18.2మిమీ,అల్లూరి జిల్లా కొయ్యురులో 17.7మిమీ, కాకినాడ జిల్లా తొండంగిలో 15.2మిమీచొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.