AP Weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం

|

Aug 22, 2021 | 4:55 PM

రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని...

AP Weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం
Rains In AP
Follow us on

రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :
—————————————————
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
——————————
ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:
———————-
ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.  అనంతపురం, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

Also Read: ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

 అతడి పొట్టలో రూ.11 కోట్ల విలువైన డ్రగ్స్.. అధికారులు షాక్.. ఫుడ్, వాటర్ వద్దనడంతో