Weather Alert: అటు ఎండలు.. ఇటు వర్షాలు.. ఆదివారం వాతావరణం ఎలా ఉంటుందంటే..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగలు ఎండలు, సాయంత్రం వేళ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుతాయని పేర్కొంది..

Weather Alert: అటు ఎండలు.. ఇటు వర్షాలు.. ఆదివారం వాతావరణం ఎలా ఉంటుందంటే..
Weather Report

Updated on: May 10, 2025 | 7:08 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగలు ఎండలు, సాయంత్రం వేళ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఎండలు కూడా ఠారెత్తిస్తాయని వాతవారణ శాఖ పేర్కొంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుతాయని పేర్కొంది..

ఆంధ్రప్రదేశ్‌లో 41°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు-11, అనకాపల్లి జిల్లా-8 మండలాల్లో తీవ్రవడగాలులు(19), మరో 30 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సోమవారం 24 మండలాల్లో తీవ్ర,57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

ఆదివారం అల్లూరి సీతారామరాజు-8, అనకాపల్లి-16, అనంతపురం-4, అన్నమయ్య-1, చిత్తూరు జిల్లా కుప్పం మండలాల్లో(30) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

వడగాలులు వీచే మండలాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శనివారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.7°C, విజయనగరంలో 41.1°C, తూర్పుగోదావరి జిల్లా మురమండలో 41°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 40.8°C, వైఎస్సార్ జిల్లా మద్దూరు,ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 40.7°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.

ఎండలో బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు.

మరోవైపు పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు, ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..