AP 10th Class Results 2022: నేడే ఏపీ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల..

|

Jun 06, 2022 | 6:30 AM

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు నేడు జూన్‌ 6, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స విడుదల చేయనున్నారు.

AP 10th Class Results 2022: నేడే ఏపీ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల..
Ap 10th Class Results
Follow us on

AP SSC Result 2022 Date and Time: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల (ఏప్రిల్‌) – 2022 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త తెలిపింది. నేడు (జూన్‌ 6, సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. విజయవాడలోని ఎమ్‌జీ రోడ్‌‌లో ఉన్న గేట్‌వే హోటల్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది.

తొలుత పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్‌ 4న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, సాంకేతిక లోపంతో నేటికి వాయిదా వేసింది. ఈ పరీక్షలకు 6,21,799 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఏపీతో సహా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలన్నింటినీ యథాతథంగా నిర్వహించి, ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి.