Andhra Pradesh: లేడీస్‌ టాయిలెట్స్‌లో రహస్య కెమెరా.. ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం

దీంతో దేశమంతా గలమెత్తింది. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అయితే పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు, వేధింపులు తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన...

Andhra Pradesh: లేడీస్‌ టాయిలెట్స్‌లో రహస్య కెమెరా.. ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 30, 2024 | 7:11 AM

సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిన భావన కలగక మానదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆకాశంలో సగం అని గొప్పలు చెప్పుకుంటూ, భూమిపై వారిని గౌరవంగా బతకనివ్వని పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి మొన్న కోల్‌కతాలో మహిళ వైద్యురాలిపై జరిగిన దారుణ సంఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడిన విషయం తెలిసిందే.

దీంతో దేశమంతా గలమెత్తింది. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అయితే పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు, వేధింపులు తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. విద్యాబుద్ధులు చెప్పే కాలేజీల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే ఎలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో ఇప్పుడీ అంశం పెద్ద చర్చకు దారి తీసింది.

వివరాల్లోకి వెళితే.. కృష్ణ జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. లేడీస్‌ టాయిలెట్స్‌లో విద్యార్థినులు రహస్య కెమెరాను గుర్తించారు. ఎవరో దుండగులు మహిళల టాయిలెట్స్‌లో రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో ఇది గమనించిన విద్యార్థినులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయాన్ని వెంటనే యాజమాన్యానికి తెలియజేశారు.

అయితే యాజమాన్యం సరిగ్గా స్పందించని కారణమో, నిందుతులను త్వరగా శిక్షించాలనో కానీ విద్యార్థినిలు పోరుబాట పట్టారు. తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఇలాంటి దారుణ సంఘటనపై యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వి వాంట్‌ జస్టిస్‌ అంటూ గురువారం రాత్రి కాలేజీ ఆవరణలో గుంపుగా చేరి నినాదాలు చేశారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే సమాచారం మీడియాకు అందకుండా ఉండేందుకు జాగ్రత్త పడి కాలేజీ గేట్లు మూయించేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!