AP Corona Cases: ఏపీలో ఇవాళ కాస్త పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 12,768 మందికి పాజిటివ్, 98 మంది మృతి

గడిచిన 24 గంటల్లో ఏపీలో 98,048 సాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 12,768 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

AP Corona Cases: ఏపీలో ఇవాళ కాస్త పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 12,768 మందికి పాజిటివ్, 98 మంది మృతి

Updated on: Jun 02, 2021 | 4:50 PM

AP Coronavirus Cases: గడిచిన 24 గంటల్లో ఏపీలో 98,048 సాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 12,768 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 98మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 11,132. కాగా, గత 24 గంటల్లో 15,612 మంది రికవరీ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 15,62,229కు చేరుకుంది. కొత్తగా కోవిడ్ వల్ల చిత్తూర్ జిల్లాలో పదిహేను మంది, నెల్లూరులో పది, పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది, అనంతపూర్ జిల్లాలో ఎనిమిది, తూర్పు గోదావరిలో ఎనిమిది, విజయనగరంలో ఎనిమిది, గుంటూరులో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, విశాఖపట్నం జిల్లాలో ఆరుగురు, కృష్ణ జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో నలుగురు, కర్నూల్ జిల్లాలో నలుగురు చొప్పున మరణించారు.

ఇక, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17,17,156 మంది మాయదారి కరోనా వైరస్ బారినపడగా, 15,62,229 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇక, ప్రస్తుతం 14,3795 మంది వివిధ ఆసుపత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

ఇక, ఏపీలో జిల్లాల వారీ కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి….

AP Corona Cases

Read Also…  Myocarditis With Pfizer vaccine: ఫైజర్ వ్యాక్సిన్‌తో గుండె మంట.. ఇజ్రాయెల్‌ తాజా అధ్యయనంలో వెల్లడి..!