AP Weather: ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

|

Jul 04, 2024 | 1:03 PM

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉంటాయని వెల్లడించింది. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం...

AP Weather: ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
Andhra Weather Report
Follow us on

ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపోయావరణములో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. మరోవైపు రుతుపవనాల ప్రభావం కూడా ఏపీపై బాగానే ఉంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

———————————-

గురువారం, శుక్రవారం, శనివారం ;- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది

 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

———————————-

గురువారం ;- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది

శుక్రవారం ;- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు. మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

శనివారం :- తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ :-

———————————-

గురువారం, శుక్రవారం, శనివారం ;-  తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…