Chandrababu Notice: టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసుల జారీపై పోలీసుల తర్జనభర్జనలు.. కారణం అదేనా..?

|

May 10, 2021 | 9:58 AM

నోటీసు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి బయల్దేరిన కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

Chandrababu Notice: టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసుల జారీపై పోలీసుల తర్జనభర్జనలు.. కారణం అదేనా..?
Chandrababu Naidu
Follow us on

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాస్త మెత్తబడిన కనిపిస్తోంది. నిన్న నోటీసు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి బయల్దేరిన కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుందని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు భయాందోళనకు గురవుతున్నాయని, కర్నూలులో న్యాయవాది సుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబునాయుడుపై కర్నూలు వన్ టౌన్ పోలీసులు నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో ఆదివారమే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. అయితే, డీజీపీ నుంచి ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. మరోవైపు కొత్త వైరస్‌పై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై.. టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. టీడీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా మంత్రి అప్పలరాజుపై కూడా కేసులు నమోదు చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విషయంలో రాజకీయంగా అచితూచి వ్యవహరించాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌తో నోటీసు ఇప్పిస్తే బాగుంటుందని న్యాయ నిపుణులు చెప్పినట్లు పోలీసులు వివరణ ఇస్తున్నారు. వాస్తవంగా అరెస్టు చేసే విషయంలో మాత్రమే స్పీకర్ పర్మిషన్ తీసుకుంటానని నోటీసు ఇచ్చేందుకు ఎవరు స్పీకర్ పర్మిషన్ తీసుకోరని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. అయితే, మంత్రి అప్పలరాజు పై ఇదే N440k వైరస్ వివాదంపై కర్నూలు జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు రావడంతో, ఇందుకు వీడియో సాక్ష్యం ఇవ్వడంతో చంద్రబాబుకు నోటీసు ఇచ్చేందుకు వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇదిలావుంటే, చంద్రబాబుకు నోటీసులు ఇస్తున్నామని, 7రోజుల్లో గా సమాధానం చెప్పాలని సాక్షాత్తూ కర్నూలు జిల్లా ఎస్పీ మీడియా ముందు ప్రకటించారు. అయితే, నోటీసులు ఇవ్వడంపై వెనక్కు తగ్గడం వెనుక పెద్ద కారణమే ఉంటుందని అనుకుంటున్నారు కర్నూలు జిల్లా వాసులు.

Read Also… E-Pass: ఏపీలో ఇకపై అత్యవసర ప్రయాణానికి.. ఈ-పాస్ తప్పనిసరి.. నేటి నుంచి అమలు..