Vizag: మదీనాబాద్ డబల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. ఆ కారణంగానే చంపారని నిర్ధారణ..

|

Sep 14, 2022 | 6:28 AM

Vizag: ట్విస్టులకు ట్విస్టులు ఇచ్చి పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన ఆ కేసును చివరకు ట్రాక్ అయింది. కోడలి వెర్షన్ తో ముందుగా కుటుంబ సభ్యుల్లోనే..

Vizag: మదీనాబాద్ డబల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. ఆ కారణంగానే చంపారని నిర్ధారణ..
Arrest
Follow us on

Vizag: ట్విస్టులకు ట్విస్టులు ఇచ్చి పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన ఆ కేసును చివరకు ట్రాక్ అయింది. కోడలి వెర్షన్ తో ముందుగా కుటుంబ సభ్యుల్లోనే నిందితులు ఉన్నారని అనుమానించిన పోలీసులు.. ఫైనల్‌గా డబ్బు కోసం తెలిసినవారే హత్య చేసినట్టు నిర్ధరించ్చారు. అవును, విశాఖలో సంచలనం సృష్టించిన డబల్ మర్డర్ కేసులో ఎట్టకేలకు మిస్టరీ విడింది. పక్కా క్లూస్‌తో పోలీసులు కేసును చేదించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఇస్లాం పేట సమీపంలోని మదీనా బాగ్‌లో JNNURM బ్లాక్ నెంబర్ 3లో తల్లీ కొడుకులు దారుణ హత్యకు గురైయ్యారు. 55ఏళ్ల మంగి గౌరమ్మ.. 35ఏళ్ల కొడుకు మంగి పోలరెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు.

వారం రోజుల క్రితం గౌరమ్మ తన కూతురుతో ఫోన్‌లో మాట్లాడడం విన్నాడు చైతన్య అనే కుర్రాడు. ఇంట్లో భారీగా డబ్బు, నగలు ఉన్నాయని ఫోన్లో మాట్లాడడం విన్న చైతన్య.. గౌరమ్మను మర్డర్‌కు ప్లాన్‌ చేశాడు. ముందుగా అనుకున్న ప్రకారం స్కెచ్‌ వర్కౌట్‌ కాలేదు. ప్లాన్‌ చేంజ్‌ చేసిన చైతన్య గౌరమ్మ ఇంటికి వెళ్లి మద్యం సేవించారు. అక్కడ పోలారెడ్డితో ఘర్షణకు దిగి.. అతన్నే కాళ్లు చేతులు కట్టి హతమార్చారు. అడ్డొచ్చిన గౌరమ్మను గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఆ తరువాత డబ్బు, నగల కోసం ఇల్లంతా వెతికారు. గౌరమ్మ చెప్పిన దాంట్లో ఒక్క శాతం కూడా అక్కడ నగదు, నగలు కనిపించలేదు. దీంతో ఇంట్లో ఉన్న 2వేల క్యాష్‌, రోల్డ్‌ గోల్డ్‌తో పరార్‌ అయ్యారు. అయితే.. చావుకు ముందు గొప్పలు చెప్పిన గౌరమ్మ పరిస్థితిపై పోలీసులు ఆరా తీశారు. ఆమె ఖాతాను పరిశీలించిన పోలీసులకు 35 వేలు మాత్రమే ఉన్నట్టు తేలింది. అయితే.. గౌరమ్మ ఎందుకు అబద్దమాడిందో ఎవరికి తెలియదు.

గొప్పలకు పోతే ఎలా ఉంటుందో ఈ రెండు హత్య కేసులే ఉదాహరణ. తెలియని వాళ్లకు నమ్మి చేరదీసి.. తన వద్ద డబ్బు బంగారం ఆ స్థాయిలో లేకపోయినా.. గౌరమ్మ గొప్పలకు పోయింది. ఆ మాటలు విన్న హంతకులకు ఆశ కలిగి హత్యలు చేశారు. గౌరమ్మ గొప్పలు.. ఆమెతోపాటు అతని కొడుకును హత మారిస్తే.. ఆ గొప్పలు నిజమేనని నమ్మిన హంతకులు ఇద్దరూ కటకటాల వెనక్కు వెళ్లారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..