Polavaram Coffer Dam works: పోలవరంలో వరద నీటిని మళ్లించేందుకు సీజన్‌కు ముందే పనులు పూర్తయ్యాయి. వర్షాకాలంలో ప్రాజెక్ట్ పనులకు ఏ మాత్రం ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ సిబ్బంది. స్పిల్ వే నుంచి వరదనీరు మళ్ళించేందుకు పనులు పూర్తి చేశారు.
ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణాన్ని సిద్ధం చేసింది మేఘా సంస్థ. గోదావరికి అడ్డుకట్ట వేయడం ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు అధికారులు. నదీ ప్రవాహ మళ్లింపు ప్రక్రియ మొదలైంది. నదిలో నీటిని ఎడమ వైపు నుండి కుడి వైపుకు మళ్ళిస్తుస్తున్నారు.
అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి తరలిస్తున్నారు. పైలెట్ ఛానెల్ దగ్గర సహజ ప్రవాహంతో నీరు కలుస్తుంది. ఎడమ వైపు నుండి కుడి వైపుకు దాదాపు 6.5 కిలోమీటర్ల వరకు ప్రవాహాన్ని మళ్లిస్తున్నారు. ఈ సీజన్ నుండే గోదావరి నీటిని స్పిల్ వే నుండి విడుదల చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు అధికారులు. రివర్స్ స్లూయిజ్ గేట్లను ఎత్తి గోదావరి నీటిని దిగువకు విడుదల చేస్తారు.
ఈ వర్షాకాలంలో వచ్చే వరద నీటిని స్పిల్ వే రేడియల్ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇప్పటికే 14 రేడియల్ గేట్లను పైకెత్తి సిద్ధంగా ఉంచారు. మిగతా గేట్ల పనులు పూర్తవుతున్నాయి. మరోవైపు ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి.
Read Also…