తెలుగురాష్ట్రాల్లో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. నిషారాత్రిలో తమ హుషారు చూపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. నగరాలు, ఊళ్లపై పడి.. ఇళ్లను కొల్లగొట్టేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు దొంగలు ఈ మధ్య బాగా తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. తమ క్రియేటివ్ బ్రెయిన్ వాడి… మూడో కంటికి చిక్కకుండా పని కానిచ్చి వెళ్లిపోతున్నారు. ఎలాంటి క్లూస్ వదలకుండా పక్కాగా కేర్ తీసుకుంటున్నారు. చేసేది ఎలాగూ దొంగతనమే. అదేదో పక్కాగా చేస్తే..చిక్కే ఉండదు కదా..! ఇదే ఫార్ములా ఫర్‌ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నారు చోరులు. అంతేకాదు దండిగా డబ్బులు ఉంటాయని ఏకంగా పెద్ద పెద్ద వ్యక్తులు ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఒన్ ఫైన్ నైట్ దొడ్డిదారిన ఎంట్రీ ఇచ్చి.. అందినకాడికి కాజేసి ఎస్కేప్ అవుతున్నారు.
కృష్ణా జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఆయన స్వస్థలం బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెం ముందడుగు కాలనీలోని ఎమ్మెల్యే ఇంట్లో..బంగారు నగలు అపహరించుకుపోయారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు..సుమారు 3 లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు.
నెల కిత్రం ఇంటికి తాళం వేసి పామర్రులోని ఎమ్మెల్యే నివాసంలోనే ఉంటున్నారు ఆయన తల్లిదండ్రులు. పనిమనిషి దొంగతనం జరిగినట్లు గుర్తించి.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వీరవల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.