
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. గంటకు 30-40 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంది.
ఏపీలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడటంతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వానలు పడుతాయని వివరించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. నేడు తెలంగాణలోని 29 జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..