Perni Nani: మోహన్‌ బాబుతో భేటీ నా వ్యక్తిగతం.. ఆయన పిలిస్తేనే వెళ్లాను. పేర్నినాని వివరణ..

Perni Nani: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్నినాని మోహన్‌ బాబును కలవడంపై పలు కథానలు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ విషయమై పేర్నినాని అధికారికంగా స్పందించారు. మోహన్‌ బాబు పిలిస్తేనే వాళ్లింటికి వెళ్లానని తెలిపారు. ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చేందుకు..

Perni Nani: మోహన్‌ బాబుతో భేటీ నా వ్యక్తిగతం.. ఆయన పిలిస్తేనే వెళ్లాను. పేర్నినాని వివరణ..
Perni Nani

Updated on: Feb 11, 2022 | 6:42 PM

Perni Nani: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్నినాని మోహన్‌ బాబును కలవడంపై పలు కథానలు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ విషయమై పేర్నినాని అధికారికంగా స్పందించారు. మోహన్‌ బాబు పిలిస్తేనే వాళ్లింటికి వెళ్లానని తెలిపారు. ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చేందుకు వెళ్లలేదని, మోహన్‌బాబు భేటీ తన వ్యక్తిగతమని తెలిపారు. టాలీవుడ్‌ ప్రముఖులతో జరిగిన సమావేశంపై సంజాయిషీ చెప్పుకోవడానికి వెళ్లలేదు అని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

ఈ విషయమై నాని మాట్లాడుతూ.. ‘సినిమా వాళ్లు తమకు న్యాయం జరిగింది, ఆనందంగా ఉన్నారని చెబుతూంటే, ఇంతవరకు సినీ పరిశ్రమ గురించి ఏ ఒక్కరోజైనా ఏ పనైనా చేశారా.? సినిమావాళ్లను రాజకీయాలకు వాడుకోవడం తప్పిదే ఎవరికీ ఉపయోగపడలేదు. తనకు నచ్చిన వాళ్లను ఒక రకంగా నచ్చని వాళ్లకు మరో రకంగా చూస్తారు.

సినిమా ఇండస్ట్రీని అవలక్షణ పాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఈరోజు అన్ని సరిదిద్దు సినిమా వాళ్లు కూడా కాలర్‌ ఎగిరేసుకొని వ్యాపారం చేసే పరిస్థితులు జగన్‌ మోహన్‌ రెడ్డి కల్పించారు. టాలీవుడ్‌ ప్రముఖులు జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిస్తే దుష్ప్రచారం చేస్తున్నారు. మోహన్‌ బాబు ఆహ్వానం మేరకు కాఫీ తాగడానికి వెళ్లాను. దీనిని కూడా రకరకాలు ప్రచారం చేశారు’ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Also Read: NCSCM jobs: నిరుద్యోగులకు అలర్ట్‌! ఎన్సీఎస్సీఎమ్‌లో భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే..

Ranga Ranga Vaibhavanga: అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా రిలీజ్ అయ్యేది అప్పుడే..

Ranga Ranga Vaibhavanga: అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా రిలీజ్ అయ్యేది అప్పుడే..