AP Local Body Elections 2021: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఝలక్.. వారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశం..

|

Mar 16, 2021 | 12:37 PM

AP High Court: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎంపీటీసీ,

AP Local Body Elections 2021: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఝలక్.. వారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశం..
Ap High Court
Follow us on

AP High Court: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాల అంశంలో ఎస్ఈసీ ఉత్తర్వులను పక్కన పెట్టింది. గతంలో ఏకగ్రీవమైన వారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎస్ఈసీ ఏకగ్రీవాలపై దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల హైకోర్టు కొట్టేసింది. ఏకగ్రీవాలపై దర్యాపతు జరిపేందుకు వీల్లేదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఏకగ్రీవాలు కొనసాగుతాయని, గతంలో ఏకగ్రీవమైన వారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని ఆదేశించింది. కాగా, బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్లు వేయనివ్వకుండా ఏకగ్రీవాలు చేసిన స్థానాలపై విచారణ చేపట్టాలంటూ ఎస్ఈసీ ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఎస్ఈసీకి షాక్ ఇస్తూ తీర్పునిచ్చింది.

Also read:

CID notices to Chandrababu: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు.. అసలు అమరావతి భూముల్లో ఏం జరిగిందంటే…

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అంటే ‘భయపడిపోతున్న’ యూరప్ దేశాలు, తాజాగా బ్యాన్ చేసిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కూడా,

CID Notice Chandrababu: అమరావతి భూముల కుంభకోణం.. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. టీవీ9 చేతికి కీలక నివేదిక.. Live Updates