AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ పని చేస్తే నిత్యావసర సరుకులు ఫ్రీ.. ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్..

ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ షాపులను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ఏర్పాటు చేయగా.. మరికొన్ని ప్రాంతాల్లో కూడా నెలకొల్పే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తిరుపతి, పెనమలూరులో ఏర్పా టు చేసింది. వీటికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది.

Andhra Pradesh: ఆ పని చేస్తే నిత్యావసర సరుకులు ఫ్రీ.. ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్..
Green Shops
Venkatrao Lella
|

Updated on: Apr 29, 2026 | 6:49 PM

Share

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పారిశుద్ద్యానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం అమల్లో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, రాష్ట్రంలో 100 శాతం చెత్త రహితంగా మార్చాలనే లక్ష్యం పెట్టుకుంది. ఇందులో భాగంగా గ్రామాల్లో కొత్తగా గ్రీన్ షాపులను ఏర్పాటు చేయనుంది. పాడైన వస్తువులు అందిస్తే ఉచితంగా ఇక్కడ నిత్యావసర సరుకులు అందించనున్నారు. ప్లాస్టిక్, ఐరన్, అల్యూమినియం, పేపర్లు, పుస్తకాలను ఈ షాపుల ద్వారా కొనుగోలు చేస్తారు.

విడతల వారీగా షాపులు

కొనుగోలు చేశాక వచ్చిన డబ్బుల విలువను లెక్కగట్టి వాటికి సమానమైన నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించనున్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయగా.. దశలవారీగా అన్ని జిల్లాల్లో నెలకొల్పనున్నారు. ఈ షాపుల ద్వారా సేకరించిన వస్తువులను రీసైక్లింగ్ చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన తిరుపతి జిల్లా చెర్లోపల్లిలో ఈ షాపును ప్రారంభించగా.. ఆ తర్వాత కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో 15 షాపులను నెలకొల్పారు. విడతల వారీగా అన్ని జిల్లాల్లోనూ ఈ షాపులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ షాపులను కృష్ణా జిల్లాలో కిరాణా షాపుల యజమానులకు అప్పగించారు. భవిష్యత్తులో మరింత మంది ముందుకొచ్చి ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ధర ఎంతో తెలుసా..?

ఇక 10 కిలోల కంటే ఎక్కువ వస్తువులు ఉంటే షాపుల నిర్వాహకులు ఇంటికొచ్చి తీసుకెళ్తారు. ఒక మొబైల్ నెంబర్‌ను అందుబాటులో ఉంచుతారు. ఆ నెంబర్‌కు కాల్ చేసి చెబితే ఇంటికొచ్చి తీసుకెళ్తారు. వాటి విలువ ఆధారంగా ఒక టోకెన్ అందిస్తారు. నెలకు ఒకసారి వాటిని లెక్కించి అందుకు సమానమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. ఇక పాడైన వస్తువుల ధరలను కూడా ఫిక్స్ చేశారు. కేజీ ఐరన్ రూ.25, పుస్తకాలు రూ.10, పేపర్లు రూ.20, స్టీల్ వస్తువులు రూ.45, అల్యూమినియం రూ.150 లెక్కన నిర్ణయించారు. ఇక గాజు బాటిళ్లు ఒక్కొక్కటి రూ.3, ప్లాస్టిక్ బాటిళ్లు రూ.25, అట్ట పెట్టెలు రూ.10 చొప్పున ఫిక్స్ చేశారు. ఇప్పటివరకు 3,380 టన్నులను ప్రభుత్వం సేకరించింది. వీటి విలువ రూ.5.40 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. స్వచ్చ రథాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ గ్రీన్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. పాడైపోయిన వస్తువులను రోడ్లపై పడేయటం, కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది.

Follow Us