
Andhra Pradesh Holidays List 2026
అమరావతి, డిసెంబర్ 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి గురువారం (డిసెంబర్ 4) పబ్లిక్ సెలవులు, ఆప్షనల్ సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా క్యాలెండర్‌లో వచ్చే ఏడాదికి మొత్తం 24 పబ్లిక్ హాలిడేలు, 21 ఆప్షనల్ సెలవులు వచ్చాయి. ఇవికాకుండా సెకండ్, ఫోర్త్ శనివారాలు, ఆదివారాలతో కలిపి భారీగానే సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది. 2026 సంవత్సరంలో ఏయే తేదీల్లో ఎప్పుడెప్పుడ సెలువులు వస్తాయో ఈ కింద తెలుసుకుందాం..
2026 సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఇవే..
- భోగి పండగ తేదీ: జనవరి 14 (బుధవారం)
- మకర సంక్రాంతి పండగ తేదీ: జనవరి 15 (గురువారం)
- కనుమ పండగ తేదీ: జనవరి 16 (శుక్రవారం)
- రిపబ్లిక్ డే తేదీ: జనవరి 26 (సోమవారం)
- మహా శివరాత్రి పండగ తేదీ: ఫిబ్రవరి 15 (ఆదివారం)
- హోలీ పండగ తేదీ: మార్చి 3 (మంగళవారం)
- ఉగాది పండగ తేదీ: మార్చి 19 (గురువారం)
- రంజాన్ పండగ తేదీ: మార్చి 20 (శుక్రవారం)
- శ్రీరామ నవమి పండగ తేదీ: మార్చి 27 (శుక్రవారం)
- గుడ్ ఫ్రైడే తేదీ: ఏప్రిల్ 3 (శుక్రవారం)
- బాబు జగ్జీవన్‌రావ్ జయంతి తేదీ: ఏప్రిల్ 5 (ఆదివారం)
- బీఆర్ అంబేద్కర్ జయంతి తేదీ: ఏప్రిల్ 14 (మంగళవారం)
- బక్రీద్ పండగ తేదీ: మే 27 (బుధవారం)
- మొహర్రం పండగ తేదీ: జూన్ 25 (గురువారం)
- ఇండిపెండెన్స్ డే పండగ తేదీ: ఆగస్టు 15 (శనివారం)
- వరలక్ష్మి వ్రతం పండగ తేదీ: ఆగస్టు 21 (శుక్రవారం)
- మిలాద్ ఉన్ నబీ పండగ తేదీ: ఆగస్టు 25 (మంగళవారం)
- శ్రీకృష్ణాష్టమి పండగ తేదీ: సెప్టెంబర్ 4 (శుక్రవారం)
- వినాయక చవితి పండగ తేదీ: సెప్టెంబర్ 14 (సోమవారం)
- గాంధీ జయంతి తేదీ: అక్టోబర్ 2 (శుక్రవారం)
- దుర్గాష్టమి పండగ తేదీ: అక్టోబర్ 18 (ఆదివారం)
- విజయ దశమి పండగ తేదీ: అక్టోబర్ 20 (మంగళవారం)
- దీపావళి పండగ తేదీ: నవంబర్ 8 (ఆదివారం)
- క్రిస్మస్ పండగ తేదీ: డిసెంబర్ 25 (శుక్రవారం)
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.