Aadhaar Card: మనకే కాదు.. ఏనుగులకు కూడా ప్రత్యేక ఆధార్ కార్డు.. ఎక్కడో కాదండోయ్..

మనుషులకు ఆధార్ ఉన్నట్లుగానే.. ఏనుగులకు ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది.. అవును ఏపీలో ఏనుగులకు కూాడా ఆధార్ తరహాలోనే ప్రత్యేక గుర్తింపు కార్డులు అందిస్తున్నారు. ఇవి అచ్చం ఆధార్‌లానే ఉంటాయి. వీటిని కుంకీ ఏనుగులకు తగిలించనున్నారు. త్వరలోనే వీటిని అధికారులు తయారుచేయనున్నారు.

Aadhaar Card: మనకే కాదు.. ఏనుగులకు కూడా ప్రత్యేక ఆధార్ కార్డు.. ఎక్కడో కాదండోయ్..
Kmki

Updated on: May 06, 2026 | 8:25 AM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంకీ ఏనుగులకు ఆధార్ కార్డు తరహాలోనే ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను తీసుకురానుంది. ఇందుకోసం డీఎన్‌ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం రక్త నమూనాలను సేకరించగా.. వాటిని డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు అధికారులు పంపారు. అక్కడ డీఎన్‌ఏ టెస్టులు పూర్తయిన అనంతరం వాటి వివరాల ఆధారంగా ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు ఏనుగులకు తగిలించనున్నారు. ఈ గుర్తింపు కార్డు ఆధార్ తరహాలోనే ఉంటుంది. ఏనుగుకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉంటాయి. భవిష్యత్తులో ఏనుగులకు వైద్యం చేయించాలన్నా, జన్యుపరమైన సమస్యలకు ఈ గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఏనుగుల ఆరోగ్యాన్ని కూడా దీని వల్ల అంచనా వేయవచ్చని అంటున్నారు.

ఆధార్ కార్డు తరహాలోనే..

కర్ణాటక నుంచి ఏపీ ప్రభుత్వం ఆరు కుంకీ ఏనుగులను తీసుకొచ్చింది. కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని వీటిని రాష్ట్రానికి తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిని ఏపీకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇవి రాష్ట్రానికి రావడంలో ముఖ్య మాత్ర పోషించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని పలమనేరు కౌండిన్స ఎలిఫెంట్ శాంక్చువరీలో ఇవి ఉన్నాయి. వీటి సంరక్షణ, ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్డులు తయారు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం డీఎన్‌ఏ డెస్టుల కోసం రక్త నమూనాలను సేకరించారు. ఈ ఫలితాలు వచ్చాక కార్డులను తయారుచేసి వాటికి తగిలించనున్నారు. భవిష్యత్ అవసరాల కోసం ఇవి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఉండగా.. వీటికి వినయ్, రంజన్, జయంత్, దేవ, అభిమన్యు, కృష్ణ అనే పేర్లు పెట్టారు. అయితే గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా ఈ కుంకీ ఏనుగులు అడ్డుకుంటాయి. అడవుల్లోని ఏనుగులు గ్రామల్లోకి రాకుండా కుంకీ ఏనుగులు వాటిని మళ్లించేలా శిక్షణ ఇచ్చారు. ఈ ప్రక్రియ విజయవంతగా కొనసాగుతోంది. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉండటంపై సంరక్షణకు ప్రత్యక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక సహాయకులు

కుంకీ ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేక సహాయకులు,ట్రైనర్‌ను నియమించారు. వాటికి ప్రత్యేక ఫుడ్ అందిస్తున్నారు. ఈ ఏనుగులు భారీ బరువుని కూడా సునాయాసంగా మోయగలవు.  అటవీ ప్రాంతాల్లో భారీ వస్తువులు మోయడానికి ఇవి సహాయపడతాయి. ఇక కష్టతరమైన పనులను కూాడా ఇవి సులువుగా చేస్తాయి. అడవి ఏనుగులు పోలాలు, గ్రామాల్లోకి రాకుండా ఇవి అడ్డుకుంటాయి. వీటి సంరక్షణకు భారీగానే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

Follow Us