Andhra Pradesh GO.02: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ను ప్రవేశపెట్టింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ ప్రభుత్వ ఉత్తర్వులను ఏపీ సర్కార్ జారీ చేసింది. అయితే, ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది. అయితే దీనిపై మరోసారి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 2ను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది.
అయితే, ఈ జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ జీవో వివరాల్లోకి వెళితే.. సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 2ను తీసుకొచ్చింది. అయితే దీనిపై సర్పంచులు, కార్యదర్శుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ జీవో వలన తమ పదవికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా అవుతుందని గ్రహించిన సర్పంచులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ జీవోపై ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. జీవో నంబర్ 2ను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది ఏపీ ప్రభుత్వం.