Andhra Pradesh Government: సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం నుంచి అదిరే న్యూస్.. వారందరికీ తగ్గనున్న ఈఎంఐల భారం..

సంక్రాంతి ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ప్రజలకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు కొత్తగా తీసుకుంటోంది. ఈ క్రమంలో పండుగ వేళ కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకున్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది.

Andhra Pradesh Government: సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం నుంచి అదిరే న్యూస్.. వారందరికీ తగ్గనున్న ఈఎంఐల భారం..
Money

Updated on: Jan 13, 2026 | 9:26 AM

సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని వర్గాలకు లాభం జరిగేలా కొత్త కార్యక్రమాలను మొదలుపెడుతోంది. సంక్రాంతి అంటేనే ఏపీలో పెద్ద పండుగ. ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు కూడా ఖచ్చితంగా పండక్కి తమ సొంతూర్లకు చేరుకుంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో గుమగుమలాడే రకరకాల పిండి వంటలు వండుతూ ఉంటారు. ఇక పండక్కి రకరకాల నాన్ వెజ్ వంటకాలు ఇంటికి వచ్చే అతిధులకు వడ్డిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రజలకు పండగ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

నిరుద్యోగులకు శుభవార్త

ఏపీలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. జాతీయ షెడ్యూల్ కులాల ఆర్ధిక, అభివృద్ది కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్నవారికి ఊరట లభించింది. వారి రుణాలకు పూర్తిగా వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేవారికి పూర్తి వడ్డీ రాయితీ అందించనున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌తో పాటు జాతీయ సఫాయికర్మచారీల ఆర్ధిక అభివృద్ది కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు లబ్దిదారులకు అందించారు. 2014 నుంచి 2019 మధ్య స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి యూనిట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు రుణాలు అందించారు. ప్రస్తుతం లోన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోగా.. తీసుకున్నవారి దగ్గర డబ్బులు వసూలు చేయడం కూడా నిలిచిపోయింది. ఈ క్రమంలో రుణాలు తీసుకున్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోపు రుణం తిరిగి చెల్లించినవారికి వడ్డీ మాఫీ చేయనుంది. కేవలం తీసుకున్న అసలు చెల్లిస్తే సరిపోతుంది.

6 శాతం వడ్డీ

నిరుద్యోగులకు ఇచ్చిన రుణాలకు ప్రభుత్వం 6 శాతం వడ్డీ నిర్ణయించింది. తిరిగి చెల్లించినవారికి పూర్తిగా వడ్డీ మాఫీ చేయడంతో లోన్లు తీసుకున్నవారికి ఊరట కలిగినట్లయింది. ఏప్రిల్ లోపు రుణం చెల్లించి ఈ అవకాశాన్ని ఉపయోగించాలని రుణగ్రహీతలకు ఏపీ ప్రభుత్వం సూచించింది. గతంలో రుణాలు తీసుకుని చెల్లించనివారితో పాటు ఈఎంఐలు కట్టనివారికి ఇది మంచి అవకాశమని స్పష్టం చేసింది. ఏప్రిల్‌లోపు తీసుకున్న రుణం మొత్తం చెల్లిస్తేనే వడ్డీ మొత్తం మాఫీ చేస్తారు. కాగా నిరుద్యోగులకు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఏపీ ప్రభుత్వం 45 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇక ఎన్‌ఎఫ్‌డీసీ నుంచి 53 శాతం లోన్ రూపంలో అందిస్తుండగా.. మిగతా 2 శాతం లబ్దిదారుడు భరించాల్సి ఉంటుంది. ఈ లోన్లను ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు.