AP Good News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లో 10% ప్లాట్లు రిజర్వ్!

|

Jan 13, 2022 | 9:12 AM

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలోని MIG లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10% మేర ప్లాట్లను రిజర్వు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Good News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..  జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లో 10% ప్లాట్లు రిజర్వ్!
Jagananna Township
Follow us on

Jagananna Smart Township: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా ఒక్కొక్కటి నెరవేస్తున్నారు. ఇంత కాలం ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలో మధ్యతరగతి ప్రజల కోసం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ప్రాజెక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సీఎం జగన్ ఈ మెగా ప్రాజెక్ట్‌కు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇళ్ల కేటాయింపులు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలోని MIG లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10% మేర ప్లాట్లను రిజర్వు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాట్ల ధరలోనూ 20% మేర రిబేట్ ను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పురపాలక శాఖ. పీఆర్సీ ప్రకటన సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్లాట్లలో రిజర్వేషన్, ధరలో రిబేట్ ను ఇస్తున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలోని MIG లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10% మేర ప్లాట్లను రిజర్వుG.O.Ms.No.3, MA & UD (M) Dept., Dt.12.01.2022 – Reserving 10% plots for Govt. Employees

ఇదిలావుంటే, గుంటూరు జిల్లా నవులూరులోని టౌన్‌షిప్‌ను, వెబ్‌సైట్‌ను రెండు రోజుల క్రితం సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ప్లాట్లకు తొలిరోజు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం వెబ్‌సైట్‌ ప్రారంభించిన కొద్దిసేపటికే దరఖాస్తులు వచ్చాయని టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు. మొదటి విడతగా 10% ఫీజును చెల్లించారు.. మరికొంతమంది మొత్తం ప్లాట్‌ ధరను ఆన్‌లైన్‌లో చెల్లించి 5 శాతం రాయితీ పొందారు. నవులూరు లేఔట్‌లో 200, 240 చ.గజాల్లో 538 ప్లాట్లను అందుబాటులో ఉంచగా.. మొదటిరోజు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించారు.

ఈ టౌన్‌షిప్‌లలో అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుంది. వీటితో పాటు ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధమవుతున్నాయి. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లే అవుట్లు సిద్ధం చేశారు.

మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద వేసిన లేఅవుట్‌లో తొలి విడతలో 538 ప్లాట్లు వేశారు. ఎవరైనా ఈ లే అవుట్లలో ప్లాట్లు కొనాలనుకొనే వారు https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటరైజ్డ్‌ విధానంలో పూర్తి పారదర్శకతతో లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయిస్తారు. ప్రతి లే అవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను కేటాయించడంతో పాటు 20 శాతం రిబేటు కూడా ప్రకటించారు. దరఖాస్తు సమయంలో మొత్తం ప్లాటు ధర చెల్లించినవారికి ఐదు శాతం రాయితీ ఇస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పాటు మొత్తం ప్లాట్‌ ధరలో 10% ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ప్లాట్‌ను కేటాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మూడు వాయిదాల్లో ఆన్‌లైన్‌లో చెల్లించాలి. కొనుగోలు ఒప్పందం కుదిరిన నెల రోజుల్లోపు 30%, ఆరు నెలల్లో మరో 30%, మిగిలిన 30 % నగదును ఏడాదిలోగా చెల్లించాల్సి ఉంటుంది.

Read Also… Covid Spreads Among Doctors: రికార్డు స్థాయిలో కరోనా..వైద్యులను టార్గెట్‌ చేసిన వైరస్‌..(వీడియో)