Andhra Pradesh: చంద్రబాబుకు అధికారం కావాలి.. పవన్ కు డబ్బు కావాలి.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్

|

May 09, 2022 | 7:53 PM

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా 55 శాతం వైసీపీకే వస్తాయని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) అన్నారు. నిన్న మొన్నటి వరకూ టీడీపీకి సపోర్ట్ గా పవన్ పని చేశారన్న...

Andhra Pradesh: చంద్రబాబుకు అధికారం కావాలి.. పవన్ కు డబ్బు కావాలి.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్
Kodali Nani Latest
Follow us on

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా 55 శాతం వైసీపీకే వస్తాయని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) అన్నారు. నిన్న మొన్నటి వరకూ టీడీపీకి సపోర్ట్ గా పవన్ పని చేశారన్న కొడాలి నాని 2014 లో జనసేన పార్టీని స్థాపించింది కూడా చంద్రబాబు(Chandrababu) కోసమేనని వ్యాఖ్యానించారు. 2019 లో టీడీపీ వ్యతిరేక ఓటు చీల్చడానికి వేరుగా పోటీ చేసినట్టు నటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసే ఉన్నారని వెల్లడించారు. చివరి వరకూ కలిసే ఉంటారని స్పష్టం చేశారు. ఎంత మంది గుంపులుగా వచ్చినా జగన్(Jagan) సింహంలా రెడీగా ఉన్నారని కొడాలి నాని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్తున్నట్లు ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంటే వేరొకరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కావాలి.. పవన్ కు డబ్బు కావాలని విమర్శించారు. పవన్, లోకేశ్ లు ముందు ఎమ్మేల్యే లుగా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.

మరోవైపు.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి సోమ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం జగన్ తో కొడాలి నాని భేటీ అయ్యారు. 2024 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు స‌మ‌యం ఉన్నా ఏపీలో అప్పుడే ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఎన్నిక‌ల్లో పొత్తుల దిశ‌గా టీడీపీ, జ‌న‌సేన, బీజేపీల నుంచి ప్రక‌ట‌న‌లు వ‌స్తుండ‌టం కాక రేపుతోంది. దీనిపై వైసీపీ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. సరిగ్గా ఈ సమయంలో జ‌గ‌న్‌తో కొడాలి నాని భేటీ కావడం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీచదవండి

ఇవి కూడా చదవండి

Bangaluru: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మధ్యాహ్నం భోజనం చేశాక హాయిగా నిద్రపోవచ్చు