Andhra Pradesh: రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిపిందే. సింగపూర్‌లో వివిధ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో రాయలసీమలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందని అన్నారు.

Andhra Pradesh: రాయలసీమకు గుడ్ న్యూస్.. సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు రంగం సిద్దం..
Semi Conductor

Updated on: Jun 16, 2026 | 2:21 PM

సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమల్లో ఉన్న పాలసీలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్‌లో సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్ట్రమని తెలిపారు. పెట్టుబడులకు ఇది సరైన సమయమని సీఎం వ్యాఖ్యానించారు.

రాయలసీమలో సెమీ కండక్టర్ల తయారీ

సెమీకండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. రాయలసీమలో త్వరలోనే ఓ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. డిఫెన్సు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఫైటర్ జెట్‌ల తయారీ సహా ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా రాయలసీమ ప్రాంతంలో అవకాశాలున్నాయని అన్నారు. సెమీకండక్టర్లపై ఏర్పాటు చేసిన సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశానికి సింగపూర్ లోని వివిధ సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ ఫౌండ్రీస్, ఎన్ఎక్స్ పీ, ఏఎస్ఎంపీటీ, ఒన్ సిస్టమ్ టెక్నాలజీస్, టెక్సెండ్ ఫోటోమాస్క్, ఆక్వాటెక్ తదితర సెమీకండక్టర్ తయారీ సంస్థలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాయి.

Follow Us