Andhra Pradesh Municipal Elections: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు.. సంచలన ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్..

|

Feb 28, 2021 | 5:18 PM

Andhra Pradesh Municipal Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..

Andhra Pradesh Municipal Elections: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు.. సంచలన ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్..
Follow us on

Andhra Pradesh Municipal Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లపై ఆంక్షలు విధించారు. వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించారు. అంతేకాదు.. ఎన్నికల కోడ్‌లో భాగంగా వాలంటీర్లపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. అంతేకాదు, వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లను వినియోగిస్తే కోడ్ ఉల్లంఘనగా భావిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఆ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం నాడు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు.

Also read:

Social Media Viral Video : నిద్రపోతూ కిందపడిపోయిన గున్న ఏనుగు .. వెంటనే స్పందించిన మిగిలిన ఏనుగులు వీడియో వైరల్

తెలుగుతమ్ముళ్లు సెకండ్ రౌండ్, పరాభవం నుంచి అధినేత తేరుకోకముందే మళ్లీ షాకుమీద షాకిలివ్వడం షురూ