EAMCET 2020: విద్యార్థులు బీ అలెర్ట్.. నేటి నుంచే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

| Edited By: Pardhasaradhi Peri

Jan 21, 2021 | 7:39 AM

EAMCET 2020: ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్‌ ఇంజనీరింగ్ రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ నుంచి ఇవాళ్టి నుంచి..

EAMCET 2020: విద్యార్థులు బీ అలెర్ట్.. నేటి నుంచే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
AP-Government-
Follow us on

EAMCET 2020: ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్‌ ఇంజనీరింగ్ రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ నుంచి ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సంబంధిత ర్యాంకర్లు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనంతరం ఈనెల 25వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తారు.

కాగా, ఇప్పటికే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. మొదటి రౌండ్‌లో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్లను ఈ దశ కౌన్సిలింగ్‌లో భర్తీ చేయనున్నారు. కాగా, మొదటి దశలో సీట్లు పొందినా ఇప్పటి వరకు రిపోర్ట్ చేయని వారి సీట్లను సైతం ప్రస్తుతం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌లో భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.

Also read:

ప్రత్యేక టెస్టింగ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

Farmers Protest : రైతు సమస్యలపై మెట్టుదిగిన కేంద్రం.. రేపటి చర్చల్లో పూర్తి క్లారిటీకి ఛాన్స్‌