Chittoor District: రైతు చెప్పిన ఆ మాటకు ఫిదా అయిన డిప్యూటీ సీఎం.. వెంటనే కాళ్లు మొక్కేశారు

|

Dec 02, 2022 | 9:47 AM

ఏపీ వ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో కొద్ది మంది లీడర్లకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.తాజాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఓ వృద్దుడి కాళ్లు పట్టుకున్నారు. దీనికి కారణం ఏంటి..?

Chittoor District: రైతు చెప్పిన ఆ మాటకు ఫిదా అయిన డిప్యూటీ సీఎం.. వెంటనే కాళ్లు మొక్కేశారు
AP Deputy CM Narayana Swamy Touches Farmer Foot
Follow us on

గడప గడపకు ప్రొగ్రామ్‌ను ఏపీ సీఎం జగన్ చాలా ప్రస్టేజ్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లో మమేకం అవ్వాలని సీఎం ఆదేశించారు. ఆసక్తి చూపనివారిని ప్రత్యేకంగా పిలిచి క్లాస్ కూడా తీసుకున్నారు. కాగా చిత్తూరు జిల్లాలో జరుగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై డిప్యూటీ సీఎం గడప గడపకు తిరుగుతూ ఆరా తీశారు. ఈ సందర్భంగా జగనన్న పథకాలతో లబ్ది పొందిన మహిళలతో కలిసి డ్యాన్సులు వేశారు. అనంతరం.. ఓ వృద్ద దంపతుల దగ్గరకు వెళ్లారు నారాయణస్వామి.

మీకు డ్వాక్రా రుణమాఫీ జరిగిందా అని ప్రశ్నిస్తే.. జరిగింది అని సమాధానం చెప్పారు. పెన్షన్‌ వస్తుందా అంటే వస్తుంది అని చెప్పారు. ఇవన్ని ఎవరు చేస్తున్నారు అని అడగగానే.. జగన్‌మోహన్‌రెడ్డి అని సమాధానం ఇవ్వడమే కాదు.. ఆయనే రావాలి ఈ సారి కూడా అంటూ బదులిచ్చారు.

సీఎం జగన్ పాలనలో కులాలు, పార్టీలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాధా నాయుడు అనే హర్షం వ్యక్తం చేశాడు. జగనన్నే మళ్లీ మళ్లీ సీఎం కావాలని కోరారు. కమ్మ సామాజిక వర్గంలో ఈ మార్పు రావడం బాగుందంటూ.. ఆయన కాళ్లను పట్టుకుని పాదాభివందనం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

మరిన్న ఏపీ న్యూస్ కోసం