AP Degree Admission Counselling Notification 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఆన్‌లైన్ ప్రవేశాలకు జూన్ 18న ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు జూన్ 19 నుంచి 24 వరకు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. ప్రత్యేక కేటగిరికి చెందిన విద్యార్ధులకు జూన్ 21 నుంచి 23 వరకు విజయవాడలో ఎస్‌ఆర్‌ఆర్, విశాఖపట్నంలో డాక్టర్ వీఎస్ కృష్ణ, తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
కోర్సులు, కాలేజీల ఎంపికకు జూన్ 26 నుంచి 30 వరకు వెబ్ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాలి. జులై 3న సీట్ల కేటాయింపు, జులై 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ ఏడాది అన్ని కాలేజీల్లో కొత్తగా సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కోర్సులో అడ్మిషన్ పొందిన విద్యార్ధులు నాలుగేళ్ల డిగ్రీలో సింగిల్ మేజర్, మైనర్ సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.