Andhra Pradesh: మార్టూరు వైసీపీలో కాంట్రవర్సీ కామెంట్స్‌ కల్లోలం.. ఆయన సమర్థించడం వల్లే..!

Andhra Pradesh: కాంట్రవర్సీ కామెంట్స్‌ మార్టూరు వైసీపీలో కల్లోలం రేపాయ్‌. వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించాల్సిన ముఖ్యనేత.. వాటిని సమర్ధించడం మరో గొడవకు దారి తీసింది.

Andhra Pradesh: మార్టూరు వైసీపీలో కాంట్రవర్సీ కామెంట్స్‌ కల్లోలం.. ఆయన సమర్థించడం వల్లే..!
Ycp

Updated on: May 31, 2022 | 10:01 AM

Andhra Pradesh: కాంట్రవర్సీ కామెంట్స్‌ మార్టూరు వైసీపీలో కల్లోలం రేపాయ్‌. వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించాల్సిన ముఖ్యనేత.. వాటిని సమర్ధించడం మరో గొడవకు దారి తీసింది. చివరికి అది, మార్టూరు మొత్తం అట్టుడికిపోయేలా చేసింది. సోమవారం నాడు బాపట్ల జిల్లా మార్టూరు మండలలో జరిగిన వైసీపీ సర్వసభ్య సమావేశం రణరంగమైంది. అరుపులు కేకలతో మీటింగ్‌ హాల్‌ దద్దరిల్లిపోయింది. సమావేశం అలా మొదలైందో లేదో గొడవ స్టార్టైంది. ఈ గొడవ జరిగింది అధికార-విపక్షాల మధ్య కాదు. అధికార వైసీపీ నేతలే ఒకరినొకరు కొట్టేసుకున్నారు.

దళితులను కించపర్చేలా మాట్లాడిన మార్టూరు మండల వైసీపీ కన్వీనర్‌ పఠాన్‌ కాలేషావలి వ్యాఖ్యలను వైసీపీ ఇన్‌ఛార్జ్‌ రావి రామనాథంబాబు సమర్ధించడంతో గొడవ మొదలైంది. మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన రావి రామనాథంబాబు ముందు దళితులు ఆందోళనకు దిగారు. పఠాన్ కాలేషావలి కామెంట్స్‌ను రామనాథంబాబు దృష్టికి తీసుకెళ్లగా సమర్ధిస్తూ మాట్లాడటంతో దళితులు రగిలిపోయారు. రామనాథంబాబును చుట్టుముట్టిన దళిత యువకులు, మహిళలు.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీటింగ్‌ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోతున్న రామనాథంబాబు కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసనకు దిగారు.

వైసీపీ దళిత నేతలు, కార్యకర్తల ఆందోళనతో మార్టూరు మండల కార్యాలయం అట్టుడుకిపోయింది. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, పోలీసులపైనా తిరగబడ్డారు ఆందోళనకారులు. రామనాథంబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ కారుకు అడ్డంగా కూర్చున్నారు. చివరికి పోలీసుల రక్షణ వలయం మధ్య అక్కడి నుంచి బయటపడ్డారు మార్టూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ రావి రామనాథంబాబు.