న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.. ఆధారాలన్నింటినీ సీబీఐకి చూపుతా: ఆమంచి కృష్ణమోహన్

|

Feb 12, 2021 | 1:28 PM

Amanchi comments: న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మరోసారి స్పష్టంచేశారు. విశాఖలో డాక్టర్..

న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.. ఆధారాలన్నింటినీ సీబీఐకి చూపుతా: ఆమంచి కృష్ణమోహన్
Follow us on

Amanchi comments: న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మరోసారి స్పష్టంచేశారు. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసును సీబీకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ బహిరంగ సభలో తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశానన్నారు. అదికూడా చీరాలలో వేలాది మంది సమక్షంలో వైఎస్సాఆర్ విగ్రహం సాక్షిగా మాట్లాడానని పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు హైకోర్టు సీజే దగ్గర పెండింగ్‌లో ఉందని తెలిపారు. తాను సదాభిప్రాయంతో వ్యాఖ్యలు చేశానని.. న్యాయ వ్యవస్థపై చేయలేదని ఇంతకుముందే తెలిపానన్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా ఇచ్చానని.. ఇదే విషయాన్ని సీబీఐకి కూడా చెబుతానని పేర్కొన్నారు.

దీనిలో భాగంగానే సీబీఐ పిలిచిందా… లేకపోతే వేరే కారణముందా అనే విషయాలు తెలియాల్సి ఉందని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. జస్టిస్ రాకేష్ కుమార్ రిజిస్ట్రార్‌కు వచ్చిన ఫిర్యాదుని సీబీఐ ద్వారా విచారణ జరపాలని ఫార్వర్డ్ చేశారని.. అంతకుముందు సీజే రిట్ పెండింగ్‌లో ఉందన్నారు. ఛానళ్లలో తాను మాట్లాడిన వీడియో ఆధారాలను సీబీఐకి చూపుతానని తెలిపారు. అయితే 2 సార్లు సీబీఐ విచారణకు హాజరుకాలేకపోయా.. ఇప్పుడు హాజరవుతున్నానని ఆమంచి కృష్ణమోహన్ వివరించారు.

Also Read:

AP Local Body Elections: గుంటూరులో దారుణం.. సర్పంచ్‌గా నామినేషన్ వేశాడని రైతుబజార్‌లో షాపులు మూసివేయించారు..

గంటా.. అవంతి.. మధ్యలో నారాయణ.. పాత మిత్రులను కలిపిన స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం.. సీన్‌ భలే ఉందంటూ కామెంట్లు