Prakasam District: చీమకుర్తిలో విషాదం.. ఏసీ పేలి మహిళా ఉద్యోగి మృతి

ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఏసీ పేలి ఓ మహిళా ఉద్యోగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో చోటుచేసుకుంది. వివారాల్లోకెళ్తే.. చీమకుర్తి పట్టణంలోని పల్లపోతు వారి వీధిలో దామర్ల శ్రీదేవి (52) అనే మహిళ కుమారుడు..

Prakasam District: చీమకుర్తిలో విషాదం.. ఏసీ పేలి మహిళా ఉద్యోగి మృతి
Woman died in AC explosion

Updated on: May 31, 2023 | 7:34 AM

ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఏసీ పేలి ఓ మహిళా ఉద్యోగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో చోటుచేసుకుంది. వివారాల్లోకెళ్తే.. చీమకుర్తి పట్టణంలోని పల్లపోతు వారి వీధిలో దామర్ల శ్రీదేవి (52) అనే మహిళ కుమారుడు సాయితేజతో కలిసి జీవనం సాగిస్తోంది. నాలుగేళ్ల క్రితం భర్త వెంకట సుబ్బారావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మృతి చెందారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన శ్రీదేవి ఒంగోలు జడ్పీ కార్యాలయంలోని పీఎఫ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.

మే 28న రాత్రి తల్లీకుమారులిద్దరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అధిక వోల్టేజీ కారణంగా కరెంట్ తీగలు కాలిపోయాయి. దీంతో పడక గదిలోని ఏసీ ఒక్కసారిగా పేలిపోయింది. నిద్రలో ఉన్న తల్లీ కుమారులిద్దరూ ఏసీ నుంచి విడుదలైన వాయువులను పీల్చి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.

ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు శ్రీదేవి, సాయితేజలను ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి శ్రీదేవి మృతి చెందారు. తల్లీదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథగా మిగిలిన సాయితేజ ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us