Andhra Pradesh: నేడు వైఎస్సార్ యంత్ర సేవ.. సీఎం చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి నగదు

|

Jun 07, 2022 | 8:00 AM

రైతుల కోసం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వైఎస్సార్‌ యంత్ర సేవ' పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ గుంటూరులో(Guntur) ప్రారంభించనున్నారు. 5,262 రైతు గ్రూపుల బ్యాంక్‌ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీ...

Andhra Pradesh: నేడు వైఎస్సార్ యంత్ర సేవ.. సీఎం చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి నగదు
Cm Jagan
Follow us on

రైతుల కోసం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ యంత్ర సేవ’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ గుంటూరులో(Guntur) ప్రారంభించనున్నారు. 5,262 రైతు గ్రూపుల బ్యాంక్‌ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీ జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్సార్ యంత్ర మిత్ర, రైతు గ్రూపుల ఖాతాల్లోకి డబ్బుల పంపిణీతో పాటు సీఎం జగన్ హరిత నగరాల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళుతూ.. పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. పేద రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే అందుబాటులోకి తెచ్చి సాగు వ్యయం తగ్గించడం, ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

సాగు చేసి, ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్నీ పంటల బీమా పరిధిలో చేర్చి రైతులపై పైసా భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. రైతులు యంత్ర సేద్యం దిశగా ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో యంత్ర పరికరాలు రైతులకు పెద్ద సంఖ్యలో అందజేస్తోంది. కంబైన్డ్ హార్వెస్టర్ల ఒక ట్రాక్, ఒక సంవత్సరం పాటు సర్వీసింగ్, ఆపరేటర్ కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. డ్రోన్ పరికరాల సహాయంతో పంటలకు సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను అందించి రైతన్నలకు పెట్టుబడి ఖర్చును తగ్గించే దిశగా ఈ ఏడాది 2,000 గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలకు డ్రోన్స్ కూడా సరఫరా చేసేవిధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి