విహార యాత్రలో విషాదం.. అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు

బోటు షికారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ అది బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

విహార యాత్రలో విషాదం.. అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు
Boat Capsize

Updated on: May 14, 2023 | 12:58 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన పర్యాటకుల పడవ బోల్తాపడి 12 మంది గల్లంతైన ఘటన తీవ్ర కలకలం రేపింది. నంద్యాల జిల్లాలోని అవుకు రిజర్వాయర్ వద్ద ఆదివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోటు షికారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ అది బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాలు లభించినట్టుగా తెలిసింది. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పర్యాటకులంతా తంజావూరుకు చెందినవారిగా సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us