#APAssemblySessions: వాడీవేడిగా ఏపీ అసెంబ్లీ.. పోలవరంపై హాట్ చర్చ.. రేపటికి వాయిదా..

| Edited By: Ravi Kiran

Dec 02, 2020 | 5:33 PM

ఆంధ్రప్రదేశ్ మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టున్నట్లు సమాచారం.

#APAssemblySessions: వాడీవేడిగా ఏపీ అసెంబ్లీ.. పోలవరంపై హాట్ చర్చ.. రేపటికి వాయిదా..
Follow us on

ఆంధ్రప్రదేశ్ మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. మొత్తం 11 బిల్లులపై చర్చ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వీటిలో 5 బిల్లులపై శాసనమండలిలో చర్చించనున్నారు. ఇక ఉభయ సభలలో కరోనా కట్టడి, పోలవరం ప్రాజెక్టు అంశం, బీసీ సంక్షేమ కార్పొరేషన్‌పై చర్చ జరగనుంది. అలాగే ఉద్యోగుల సంక్షేమం, రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపైనా సభ్యులు చర్చించనున్నారు.

ఇదిలా ఉండగా, ఇసుక సమస్యపై శాసనసభలో టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. నూతన ఇసుక విధానంతో భవన కార్మికులు ఉపాధి కోల్పోయారని, సామాన్యులకు ఇసుక దొరకడం లేదని టీడీపీ సభ్యులు వాదిస్తున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, నేతలు ఒక్కటై ఇసుకను దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.