Andhra Pradesh: వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగా షాక్.. లోపల నుంచి ఒక్కసారిగా!

|

Feb 07, 2023 | 7:53 PM

ఈ మధ్యకాలంలో సరీసృపాలు తమ ఆవాసాలను విడిచిపెట్టి.. జనావాసాల్లో రావడం ఎక్కువైపోయాయి. వాటిని చూసిన జనం దడుసుకుని..

Andhra Pradesh: వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగా షాక్.. లోపల నుంచి ఒక్కసారిగా!
Fridge
Follow us on

ఈ మధ్యకాలంలో సరీసృపాలు తమ ఆవాసాలను విడిచిపెట్టి.. జనావాసాల్లో రావడం ఎక్కువైపోయాయి. వాటిని చూసిన జనం దడుసుకుని బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సందర్భాలు ప్రతీ చోటా జరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఈ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

స్థానిక యర్రగొండపాలెం త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రంలోని ఓ ఇంట్లో 7 అడుగుల భారీ పాము ఒకటి దూరింది. ఆ ఇంటి ఫ్రిడ్జ్‌లో అది దూరి తిష్టవేయడంతో.. కుటుంబమంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈలోగా షాకింగ్ ఘటన నుంచి తేరుకుని స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అతడు అక్కడికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకుని.. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.