Pension Money: పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బులు పంపిణీ

న్యూ ఇయర్ దగ్గరకొచ్చింది.. అంతటా 2026 కొత్త సంవత్సరం జోష్ నెలకొంది.. ఇప్పటినుంచే చాలా మంది న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ పింఛన్ దారులకు.. పెన్షన్ పంపిణీ పై కీలక అప్డేట్ ఇచ్చింది..

Pension Money: పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బులు పంపిణీ
Andhra Pensioners to Get Jan 2026 Pension Early on Dec 31st

Updated on: Dec 26, 2025 | 6:51 PM

న్యూ ఇయర్ దగ్గరకొచ్చింది.. అంతటా 2026 కొత్త సంవత్సరం జోష్ నెలకొంది.. ఇప్పటినుంచే చాలా మంది న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ పింఛన్ దారులకు.. పెన్షన్ పంపిణీ పై కీలక అప్డేట్ ఇచ్చింది.. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని.. అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవి ఒకటో తారీకు నూతన సంవత్సరం ఆప్షన్ హాలిడే.. ఈ సందర్భంగా పెన్షన్ 31 వ తారీకునే పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ మేరకు దానికి సంబంధించిన ఆదేశాలను సంబంధిత అధికారులకు ప్రభుత్వం చేరవేసింది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో ఒకరోజు ముందుగానే పింఛన్ దారులు .. పెన్షన్ ను పొందనున్నారు.. పెన్షన్ పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని.. 31 నాడు అందరికీ డబ్బులు అందేలా చూడాలని అధికారులు .. ఆయా జిల్లాల యంత్రాంగాలకు సూచించారు.

ఒకవేళ 31వ తేదీన పింఛన్ తీసుకోని వారికి మరలా.. హాలిడే అనంతరం పెన్షన్ అందించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..