AP Weather: ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు.. వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదే

|

Apr 16, 2023 | 2:17 PM

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో ఎండలు దంచి కొడతాయని వివరించింది.

AP Weather: ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు.. వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదే
Andhra Weather Report
Follow us on

ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / ఈశాన్య దిశలో గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

——————————————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

—————————–

ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది.

వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .

సోమవారం, మంగళవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

———————–

ఆదివారం, సోమవారం, మంగళవారం  :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .

రాయలసీమ :-

—————-
ఆదివారం, సోమవారం, మంగళవారం  :-  పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది.