Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

|

Jul 19, 2024 | 9:44 AM

ఏపీలో డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పనకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లక్షన్నర మందికి లోన్స్ అందించేలా ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ రుణాలు ఒకే సమయంలో సంఘంలో గరిష్ఠంగా ముగ్గురికి అందించే వెసులుబాటు ఉంది.

Andhra Pradesh: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
DWCRA Women
Follow us on

ఏపీలో డ్వాక్రా సంఘాలకు మరింత చేయూత ఇవ్వాలని ఏపీలోని ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ లోన్స్ మాత్రమే కాకుండా.. భారీగా పర్సనల్ లోన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు రూ.2 వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్‌ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. 1.35 లక్షల మందికి రూ.లక్ష మేర, 15 వేల మందికి రూ.5 లక్షల లోన్స్ ఇవ్వనున్నారు. ఒక గ్రూప్‌లో ముగ్గురికి ఒకేసారి ఈ లోన్స్ ఇచ్చే వెసులుబాటు ఉంది. బ్యాంకులతో మాట్లాడి ఈ రుణాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు. కొత్తవారికి మాత్రమే కాదు.. ఇప్పటికే ఏదైనా జీవనోపాది పొందుతున్నవారికి సైతం లోన్స్ ఇస్తారు. లబ్ధిదారులు ఉత్సాహంతో ముందుకు సాగుతుంటే.. ఈ రుణాన్ని రూ 10 లక్షలు కూడా పెంచుతామని ప్రభుత్వం తెలిపింది.

డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేకూర్చేందుకు కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాల్ని (PMEGP) ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పథకం (PMFME), దీనికి కనెక్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ కింద జీవనోపాధి ఏర్పాటు చేసుకుంటే.. లోన్‌లో 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీరు లక్ష లోన్ తీసుకుంటే… రూ.35 వేలు రాయితీ కింద కట్ అవుతుంది. మిగతా రొక్కాన్ని  నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

మసాలా పొడి ప్యాకింగ్‌ యూనిట్‌, బేకరీ, కారంపొడి, పసుపు ప్యాకింగ్‌ యూనిట్‌, ఐస్‌క్రీమ్‌, అప్పడాల తయారీ, వెజిటబుల్‌ సోలార్‌ డ్రయ్యర్‌, బఫే ప్లేట్ల తయారీ, డెయిరీ, పౌల్ట్రీ, డీజే సౌండ్‌ సిస్టమ్‌, తేనె తయారీ వంటి వాటిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలతో ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి 35% రాయితీ వర్తిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.