
గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యతలో ఉన్నట్లు సమాచారం ఉంది. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక నగరలిలో మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చిన్ని ఆధిక్యంలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్‌కు 2422 ఓట్ల ఆధిక్యం ఉంది. విజయవాడ వెస్ట్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది, తొలిరౌండ్‌లో సుజనాకి 2422 ఓట్ల లీడ్ వచ్చింది. జమ్మల మడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి ఆధిక్యం ఉన్నట్లు సమాచారం. నందిగామలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యకు 481 ఓట్ల ఆధిక్యం లభించింది. పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి చినరాజప్ప 2500 ఓట్ల ఆధిక్యం ఉంది.
చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ 540 ఓట్ల ఆధిక్యం ఉంది.
రాజమండ్రి రూరల్‌లో దూసుకెళుతున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 5 రౌండ్లలో గోరంట్లకు 13,563 ఓట్ల ఆధిక్యం లభించింది. మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి లీడ్‌లో ఉన్నారు.
నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావు లీడ్ లభించింది. వెంకటేశ్వరరావుకు 1650 ఓట్ల ఆధిక్యం ఉంది.