Andhra Politics: సబ్ కలెక్టర్‌ వర్సెస్ ఎమ్మెల్యే.. మీరుండగా స్టేజిపైకి నేను రానంటే రాను.. చివరికి ఆ అధికారే..

|

Dec 26, 2020 | 5:29 AM

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల నేతల మధ్యే కాదు.. ప్రజాప్రతినిధులు, పబ్లిక్ సర్వెంట్ల(ఉద్యోగులు) మధ్య కూడా పోరాటాలు నడుస్తున్నాయి. తాజాగా..

Andhra Politics: సబ్ కలెక్టర్‌ వర్సెస్ ఎమ్మెల్యే.. మీరుండగా స్టేజిపైకి నేను రానంటే రాను.. చివరికి ఆ అధికారే..
Follow us on

Andhra Politics: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల నేతల మధ్యే కాదు.. ప్రజాప్రతినిధులు, పబ్లిక్ సర్వెంట్ల(ఉద్యోగులు) మధ్య కూడా పోరాటాలు నడుస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అలాంటి పరిస్థితే వెలుగు చూసింది. జిల్లా అధికార యంత్రాంగంపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అలకబూనారు. మీరుంటే నేను రాను అంటూ అధికారుల మొహం మీదే చెప్పేశారు. అసలేం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కార్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పండుగ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా వెంకటరిగిలోనూ ఈ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు సబ్ కలెక్టర్ గోపాల కృష్ణ, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. అయితే సబ్ కలెక్టర్ గోపాలకృష్ణపై ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు ఉండగా స్టేజి పైకి రాను. మేం కిందనే ఉంటాం. మీరు మీ కలెక్టర్ చెప్పినట్లుగా కార్యక్రమాన్ని చేసుకుని వెళ్లిపోండి. ఆ తరువాత మా కార్యక్రమం మేం చేసుకుంటాం’ అని గోపాలకృష్ణ ను ఉద్దేశించి ఆనం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన గోపాలకృష్ణ.. కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.

 

Also read:

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : అభిజీత్ ఇచ్చిన ఛాలెంజ్‌‌‌‌ను స్వీకరించి మొక్కలు నాటిన నటి కరాటే కళ్యాణి..

‘మాస్టర్’ సినిమా నుంచి కుట్టి స్టోరీ తెలుగు వర్షన్.. అలరిస్తున్న చిట్టీ స్టోరీ లిరికల్ సాంగ్