
తగ్గేదే లే.. మేము రోజుకో కొత్త స్కెచ్ వేస్తాం… తోచిన విధంగా మాయ చేస్తాం… దమ్ముంటే పట్టుకోండి అన్నట్లు సవాల్ విసురుతున్నారు గంజాయి స్మగ్లర్లు. ఆఫ్ట్రాల్ కన్నింగ్ గాళ్లకే ఇన్ని తెలివితేటలు ఉంటే.. ఎన్నో పరీక్షలు పాసై వచ్చిన మాకు ఎన్ని తెలివి తేటలు ఉండాలిరా అంటూ కేటుగాళ్ల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. తాజాగా పెడ్లర్లు ఆటోలో గంజాయి తరలించేందుకు ఇస్మార్ట్ స్కెచ్ వేశారు. ప్యాసింజర్ల మాదిరిగా ఆటోలో కొందరిని కూర్చోచెట్టి.. ఆటో టాప్ కవర్లో గంజాయి మూటలను జాగ్రత్తగా అమర్చారు. వీళ్ల వాలకంపై అనుమానం రావడంతో ఆపి చెక్ చేయగా బండారం బయటపడింది. ఒడిస్సా నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి ఆటోలో తరలిస్తున్న ఈ గంజాయిని అనకాలపల్లి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లాకి చెందిన ఐదుగురు వ్యక్తులు ఆటోలో గంజాయిని తరలిస్తుండగా అనకాపల్లి మండలం సంపతిపురం కూడలి వద్ద రూరల్ పోలీసులు నిందితులను పట్టుకున్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. వీరి వద్దనుంచి 122 కేజీల గంజాయి, ఆటో, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు పాత నేరస్థుడు అని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని పట్టుకోవాల్సి ఉందన్నారు.
Police
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..