Ambati Rayudu: మరో పొలిటికల్ షాక్ ఇచ్చిన అంబటి రాయుడు.. జనసేనలోకి మాజీ క్రికెటర్.?

|

Jan 10, 2024 | 1:57 PM

ఆయన ప్రీమియర్‌ లీగ్‌లో హిట్‌ కొట్టాడు. పొలిటికల్‌ పిచ్‌పై తడబడ్డాడు. మొదట వైసీపీలో చేరి, ఆ తర్వాత జనసేనలో చేరిపోయేందుకు సిద్ధమయ్యారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేసిన అంబటి రాయుడు.. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే హఠాత్తుగా ఆయన హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు.

Ambati Rayudu: మరో పొలిటికల్ షాక్ ఇచ్చిన అంబటి రాయుడు.. జనసేనలోకి మాజీ క్రికెటర్.?
Ambati Rayudu Mets Pawan Kalyan
Follow us on

ఆయన ప్రీమియర్‌ లీగ్‌లో హిట్‌ కొట్టాడు. పొలిటికల్‌ పిచ్‌పై తడబడ్డాడు. మొదట వైసీపీలో చేరి, ఆ తర్వాత జనసేనలో చేరిపోయేందుకు సిద్ధమయ్యారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేసిన అంబటి రాయుడు.. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే హఠాత్తుగా ఆయన హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయాల్లోకి సినిమా స్టార్స్ తరహాలోనే క్రికెటర్ల ఎంట్రీ కామనైపోయింది. చాలామంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. వారిలాగే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అంబటి రాయుడు కూడా అదే రకంగా పొలిటికల్‌ పిచ్‌పై రాణిస్తారని చాలామంది అనుకున్నారు. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన కొద్దిరోజుల్లోనే పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు రాయుడు. ఏపీలో అధికార వైసీపీ తరపున పొలిటికల్ గేమ్ అడేందుకు రెడీ అయిపోయారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రాకు రాయుడు ఓ బ్రాండ్ అంబాసిడర్‌ అంటూ సీఎం జగన్ కూడా ప్రకటించారు.

కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. అంబటి పొలిటికల్ ఇన్నింగ్స్‌కు అప్పుడే బ్రేక్ పడిపోయింది. వైసీపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పుల ప్రభావమో లేక తాను ఆశించిన ప్లేస్ దక్కలేదో తెలియదు కానీ.. పార్టీలో చేరిన పది రోజులకే రిటైర్డ్ హర్ట్‌ అయ్యారు రాయుడు. లోలోపల ఏం జరిగిందో ఏమో కానీ.. అంబటి మాత్రం పొలిటికల్‌ మ్యాచ్ ప్రారంభం కాకముందే జగన్ టీమ్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వైసీపీలో చేరిన 10 రోజుల్లోనే ఆ పార్టీని అంబటి రాయుడు వీడడం వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నారు. తనకు దుబాయ్‌లో లీగ్ లు ఉన్నాయని అందుకే రాజకీయాలకు విరామం ప్రకటించానని అన్నారు. కానీ తాజాగా పవన్ తో భేటీ ద్వారా అసలు క్లారిటీ వచ్చినట్లయింది.

ఏపీలో తెలుగుదేశం పార్టీ – జనసేన కూటమితో కలిసి వెళ్తేనే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో అంబటి వైసీపీ వీడినట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. అంబటి రాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. జనసేనకు దగ్గరయ్యారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ నేపథ్యంలోనే రాయుడు రాజకీయ భవిష్యత్‌పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆయన గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…