Jagan Cabinet 2.0: మాటల మాంత్రికుడికి గుర్తింపు.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అంబటి..

|

Apr 10, 2022 | 8:59 PM

Ambati Rambabu: ఏపీ కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు అంబటి రాంబాబు. అంబటిని మంత్రిపదవి వరించడంపై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రత్యర్థుల విమర్శలను ధాటిగా తిప్పికొట్టే అంబటి రాంబాబుకు సముచిత గౌరవం..

Jagan Cabinet 2.0: మాటల మాంత్రికుడికి గుర్తింపు.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అంబటి..
Ambati Rambabu
Follow us on

ఏపీ కొత్త మంత్రివర్గంలో(Jagan Cabinet 2.0 ) చోటు దక్కించుకున్నారు అంబటి రాంబాబు. అంబటిని మంత్రిపదవి వరించడంపై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రత్యర్థుల విమర్శలను ధాటిగా తిప్పికొట్టే అంబటి రాంబాబుకు సముచిత గౌరవం దక్కింది. కాపు సామాజిక కోటాలో సీఎం జగన్‌ ఆయనకు కొత్తమంత్రివర్గంలో చోటు కల్పించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని టాక్‌. అదే ఆయనకు మంత్రి పదవిని తెచ్చిపెట్టిందంటున్నారు ఆయన అభిమానులు. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ లీగల్‌ కన్వీనర్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి.. 1994లో జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

1989లో రేపల్లె నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి ఆ తర్వాత.. 1994, 1999లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. అడ్వకేట్‌గా, వాక్చాతుర్యం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన అంబటి.. వైఎస్సార్‌ మరణానంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు చేతిలో 924 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి అదే కోడెలపై 20,876 ఓట్ల మెజారిటీతో గెలిచి సత్తాచాటుకున్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు అంబటి.

ఇవి కూడా చదవండి: Gudivada Amarnath: కార్పోరేటర్‌ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌‌కు జగన్ కేబినెట్‌లో చోటు..

TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..