యనమలకు జోగి రమేష్ సవాల్

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌‌పై టీడీపీ నేతలు పెదవి విరిచారు. మాజీ ఆర్ధిక మంత్రి యనమల కూడా ఈ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. యనమల వ్యాఖ్యాలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి యనమల మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశాలను 80 శాతం ప్రజలకు అందించేలా బడ్జెట్ ఉందని అయితే యనమల మాత్రం ఎన్నికల […]

యనమలకు జోగి రమేష్ సవాల్

Edited By:

Updated on: Jul 12, 2019 | 9:20 PM

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌‌పై టీడీపీ నేతలు పెదవి విరిచారు. మాజీ ఆర్ధిక మంత్రి యనమల కూడా ఈ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. యనమల వ్యాఖ్యాలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి యనమల మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశాలను 80 శాతం ప్రజలకు అందించేలా బడ్జెట్ ఉందని అయితే యనమల మాత్రం ఎన్నికల హామీలను నెరవేర్చలేదనడం హాస్యాస్పదమన్నారు రమేష్.

తమ ముఖ్యమంత్రి మేనిఫెస్టోను దైవ గ్రంథంలా భావిస్తుంటే , చంద్రబాబు మాత్రం దాన్ని వెబ్‌సైట్ నుంచే తొలగించారని ఆయన మండిపడ్డారు. బడ్జెట్‌పై మాట్లాడేందుకు బహిరంగ చర్చకు యనమల సిద్ధమా అంటూ సవాల్ విసిరారు జోగి రమేష్.