ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి ఉద్యోగాలు తగ్గిపోతాయంటూ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రిక కథనాన్ని వెలువరించింది. దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందని ఆ కథనంలో అభిప్రాయపడింది. రాజ్యాంగం దేశంలోని పౌరులందరూ ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పనిచేసుకునేందుకు వీలు కల్పించిందని.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల పెట్టుబడులు, ఉత్పత్తిపై పెను ప్రభావం పడుతుందని ఆ కథనంలో పేర్కొంది. ఈ కథనాన్ని జత చేసి నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
దీనిపై ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ స్పందించారు. ‘‘మీ కామెంట్లు.. ఆ కథనం పూర్తిగా అసమగ్ర సమాచారంతో కూడినవి’’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీట్వీట్ చేశారు. స్థానికేతరులకు అవకాశాలు తగ్గించడం ద్వారా ఏపీలోని స్థానికులకు తగినన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. దీనిలో సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే ఉద్దేశమేదీ లేదని పేర్కొన్నారు. దీనిపై అమితాబ్ కాంత్ స్పందిస్తూ ఇవి తన వ్యాఖ్యలు కావని.. ఆ పత్రిక కథనాన్ని మాత్రమే తాను పోస్ట్ చేసినట్లు రీట్వీట్ చేశారు.
Andhra Pradesh's quota for locals hurts federal spirit. “Constitution of India allows every citizen to work, live & move freely in the country. State barriers will impact investment, productive efficiency& uniform labour markets.”- The Financial Express https://t.co/LTLcChvPsv
— Amitabh Kant (@amitabhk87) July 28, 2019
Not my comments. I have quoted from the report & used inverted coma. https://t.co/KxcHj8wqxx
— Amitabh Kant (@amitabhk87) July 28, 2019