సీఎం జగన్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరీన్ భేటీ

| Edited By:

Jul 02, 2019 | 3:06 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా అమరావతిలోని సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వీరిద్దరు వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఏపీ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులకు సంబంధించిన వీసాలు ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. యూఎస్‌కు సంబంధించిన వివిధ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై కూడా సీఎం కాన్సులేట్ జనరల్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సీఎంగా జగన్‌ బాధ్యతలు […]

సీఎం జగన్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరీన్ భేటీ
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా అమరావతిలోని సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వీరిద్దరు వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఏపీ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులకు సంబంధించిన వీసాలు ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. యూఎస్‌కు సంబంధించిన వివిధ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై కూడా సీఎం కాన్సులేట్ జనరల్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టాక కేథరీన్ హడ్డాతో సమావేశం కావటం ఇదే తొలిసారి.