సీఎం జగన్‌కు వల్లభనేని వంశీ లేఖ

|

Jul 09, 2019 | 9:11 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ రాశారు. గన్నవరం నియోజకవర్గంతో పాటూ.. పోలవరం కుడి కాలువ పక్కన ఉంటున్న గ్రామాల్లో రైతుల సమస్యను పట్టించుకోవాలంటూ లేఖలో కోరారు. తాగు, సాగు నీరు అందించటానికి చర్యలు తీసుకోవాలని ఆయన లేఖ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు. కాలువ విస్తరణకు సంబంధించి నష్టపోయిన రైతులు.. కోర్టు కేసులను వెనక్కి తీసుకున్నందుకుగానూ గత ఐదేళ్లుగా మోటర్ల ద్వారా నీరు అందించామని తెలిపారు. రైతులకు నీరు ఇవ్వటానికి […]

సీఎం జగన్‌కు వల్లభనేని వంశీ లేఖ
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ రాశారు. గన్నవరం నియోజకవర్గంతో పాటూ.. పోలవరం కుడి కాలువ పక్కన ఉంటున్న గ్రామాల్లో రైతుల సమస్యను పట్టించుకోవాలంటూ లేఖలో కోరారు. తాగు, సాగు నీరు అందించటానికి చర్యలు తీసుకోవాలని ఆయన లేఖ ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు.

కాలువ విస్తరణకు సంబంధించి నష్టపోయిన రైతులు.. కోర్టు కేసులను వెనక్కి తీసుకున్నందుకుగానూ గత ఐదేళ్లుగా మోటర్ల ద్వారా నీరు అందించామని తెలిపారు. రైతులకు నీరు ఇవ్వటానికి తాను సొంతంగా ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి ఇవ్వటానికి సిద్ధమని వల్లభనేని వంశీ లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం రైతులు కష్టాల్లో ఉన్నారని.. ప్రభుత్వం ఆ మోటార్లను తీసుకుని ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి తాగు, సాగు నీరు ఇవ్వాలని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. కాగా సంబంధితశాఖ మంత్రులకు కూడా వంశీ ఈ లేఖను పంపించారు.