మీ అవినీతి మరకలు టీడీపీకి పూయకండి..వైసీపీపై యామిని ఆగ్రహం

|

Jul 08, 2019 | 9:59 PM

సీఎం జగన్‌తో పాటు అతని క్యాబినెట్ మంత్రలు..వారి అవినీతి మరకల్ని చంద్రబాబుకు పూసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ మహిళా నేత యామిని సాధినేని మండిపడ్డారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నిజాయితీ, నిబద్దతతో ప్రజలకు పాలన అందించడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని.. ఆయనపై బురద జల్లాలని చూస్తే టీడీపీ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ.. ఆ అవినీతిని ఎందుకు పట్టుకోలేకపోయిందో చెప్పాలన్నారు. చంద్రబాబు పాలనలో […]

మీ అవినీతి మరకలు టీడీపీకి పూయకండి..వైసీపీపై యామిని ఆగ్రహం
Follow us on

సీఎం జగన్‌తో పాటు అతని క్యాబినెట్ మంత్రలు..వారి అవినీతి మరకల్ని చంద్రబాబుకు పూసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ మహిళా నేత యామిని సాధినేని మండిపడ్డారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

నిజాయితీ, నిబద్దతతో ప్రజలకు పాలన అందించడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని.. ఆయనపై బురద జల్లాలని చూస్తే టీడీపీ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ.. ఆ అవినీతిని ఎందుకు పట్టుకోలేకపోయిందో చెప్పాలన్నారు. చంద్రబాబు పాలనలో కరెంట్ కోతలు అంటే జనాలకు తెలియవని.. ఇప్పుడు 40 రోజుల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎద్దేవా చేశార. జగన్ పాలన మున్ముందు ఎంత దారుణంగా ఉండబోతుందో.. ఈ 40 రోజుల పాలన మచ్చుతునక అని సాధినేని యామిని ఎద్దేవా చేశారు.