AP Weather : తౌక్టే తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు రాగల మూడు రోజుల వరకూ వాతావరణ సూచనలు
AP Weather report : ఉవ్వెత్తున ముంచుకొస్తోన్న తౌక్టే తుఫాను నేపథ్యంలో అమరావతిలోని వాతావరణ కేంద్రం రాగల మూడు రోజుల వరకూ వాతావరణ సూచనలు వెల్లడించింది...
AP Weather report : ఉవ్వెత్తున ముంచుకొస్తోన్న తౌక్టే తుఫాను నేపథ్యంలో అమరావతిలోని వాతావరణ కేంద్రం రాగల మూడు రోజుల వరకూ వాతావరణ సూచనలు వెల్లడించింది. ప్రస్తుతం తౌక్టే తుఫాను తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదున్నట్టు పేర్కొంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక, ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి :
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో ఈ రోజు ఉరుములు , మెరుపులతో పాటు ఈదురు గాలులు (గంటకు 30-40 km వేగం), కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు(ఆదివారం) ఉరుములు , మెరుపులు తో పాటు ఈదురు గాలులు (గంటకు 30-40 km వేగం), కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు(సోమ), ఎల్లుండి(మంగళవారం) ఉరుములు, మెరుపులు తోపాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ : ఈ రోజు ఉరుములు , మెరుపులు తో పాటు ఈదురు గాలులు (గంటకు 30-40 km వేగం), కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలియజేశారు.