జగన్ కేబినెట్‌లోకి పోసాని.. నిజమెంత.?

సార్వత్రిక ఎన్నికల సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గట్టి సపోర్ట్‌గా నిలిచారు. ఆయన తరపున ప్రచారం చేసి.. పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆ నటులకు కీలకమైన పదవులు కట్టబెడుతున్నారు. ఇటీవలే కమెడియన్ పృథ్వి రాజ్‌కు ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతులు అప్పగించగా.. అలీ, జీవిత, రాజశేఖర్‌లకు కూడా దాదాపు పదవులు ఖరారైనట్లేనని ఇన్‌సైడ్ టాక్. ఇక తనదైన శైలి మాటకారితనంతో ఎన్నికల […]

జగన్ కేబినెట్‌లోకి పోసాని.. నిజమెంత.?

Updated on: Aug 05, 2019 | 12:06 AM

సార్వత్రిక ఎన్నికల సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గట్టి సపోర్ట్‌గా నిలిచారు. ఆయన తరపున ప్రచారం చేసి.. పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆ నటులకు కీలకమైన పదవులు కట్టబెడుతున్నారు. ఇటీవలే కమెడియన్ పృథ్వి రాజ్‌కు ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతులు అప్పగించగా.. అలీ, జీవిత, రాజశేఖర్‌లకు కూడా దాదాపు పదవులు ఖరారైనట్లేనని ఇన్‌సైడ్ టాక్. ఇక తనదైన శైలి మాటకారితనంతో ఎన్నికల ప్రచారం సమయంలో వైసీపీకి అండగా నిలిచిన పోసాని కృష్ణమురళికి జగన్ మంచి పదవి ఆఫర్ చేయనున్నారని సమాచారం. అందుకు సంబంధించి తాజాగా పృథ్వి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కొద్దిరోజుల క్రితం పృథ్వి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండస్ట్రీ వాళ్లకు జగన్ సీఎం అవ్వడం ఇష్టంలేదని… సినిమా వాళ్లకు జనాలు ఎప్పుడూ ఓట్లేయవద్దని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఈ వ్యాఖ్యలపై పోసాని మాట్లాడుతూ వాటిని పూర్తిగా ఖండించడం కూడా జరిగింది. సురేష్‌బాబు లాంటి వాళ్లు జగన్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారని కూడా చెప్పారు. ఇక దీనిపై ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టిన పృథ్వి ”పోసాని కృష్ణమురళి తనకు సోదరుడు లాంటివాడని.. ఒకటి రెండు మాటలు తాను తప్పుగా మాట్లాడినా.. అవి తమ మధ్య విబేధాలు తేవని అన్నారు. పోసాని గారు తనను ఓ మాటన్నా ఫర్వాలేదన్నారు. జగనన్న పోసాని గారికి కేబినెట్ మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం పోనక్కర్లేదని పృథ్వి తెలిపారు. దీనితో పోసానికి మంత్రి పదవి దక్కనుందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఒకవేళ పృథ్వి చెప్పినట్టు పోసానికి మంత్రి పదవి ఇస్తే జగన్ ఆయన్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది.