సీట్ల పై ఏపీ అసెంబ్లీలో “సెగపట్లు”

| Edited By: Srinu

Jul 17, 2019 | 12:40 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు మొదలైన అసెంబ్లీ సమావేశంలో సీట్ల కేటాయింపులో ఇరు పార్టీల మధ్య గందరగోళం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడికి సీటు కేటాయింపు విషయంలో టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే సభా సంప్రదాయాలు పాటించాలని అన్నారు. దీంతో టీడీపీ నేతల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించే ధోరణి వద్దని ప్రతిపక్షానికి హితవు పలికారు. స్పీకర్ […]

సీట్ల పై ఏపీ అసెంబ్లీలో సెగపట్లు
Follow us on

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు మొదలైన అసెంబ్లీ సమావేశంలో సీట్ల కేటాయింపులో ఇరు పార్టీల మధ్య గందరగోళం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడికి సీటు కేటాయింపు విషయంలో టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే సభా సంప్రదాయాలు పాటించాలని అన్నారు. దీంతో టీడీపీ నేతల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించే ధోరణి వద్దని ప్రతిపక్షానికి హితవు పలికారు. స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో కల్పించుకున్న అధికారపార్టీ సభ్యులు నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయించామని చెప్పారు. ప్రశ్నపై సమాధానం ముగిశాక తర్వాత ఎలా అవకాశం ఇస్తారని ఆనం ప్రశ్నించారు. గతంలో మీరేం సభా సంప్రదాయాలు పాటించారని అంబటి రాంబాబు… టీడీపీని ప్రశ్నించారు. స్పీకర్‌ను బెదిరించేలా ప్రతిపక్ష నేత ప్రవర్తించారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే సానుభూతి కోసం ప్రతిపక్షం పాకులాడుతోందని జగన్ విమర్శించారు. ప్రతి విషయాన్ని వివాదాన్ని చేయడం సరికాదని ఆయన అన్నారు. సీట్ల కేటాయింపునకు ఓ పద్ధతి ఉండాలని జగన్ సూచించారు.