జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు రాజోల్ స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదల అయ్యారు. కాగా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసులో రాపాక, ఆయన 15మంది అనుచరులు ఇవాళ రాజోలు స్టేషన్‌లో లొంగిపోయిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు ఆయన అరెస్ట్‌ను ఖండించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గోటీతో పోయే విషయాన్ని గొడ్డలి వరకు తెస్తున్నారని, అదుపు తప్పితే తానే రాజోల్‌కు వస్తానంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.